పాత పద్దతిలోనే గ్రూప్ -1 నియామకం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శాసన సభ సమావేశాలు అర్ధరాత్రి దాకా కొనసాగాయి. దాదాపు 17 గంటలకు పైగా కొనసాగాయి. ఈ సందర్బంగా గత కొంత కాలంగా నిరుద్యోగులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి 1-100 ఉండేలా చూడాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కొంత రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. అయినా నిరుద్యోగులు తగ్గలేదు. చివరకు ప్రభుత్వమే దిగి వచ్చింది. డిప్యూటీ సీఎం వారితో చర్చలు జరిపారు.
న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు భట్టి విక్రమార్క. ప్రస్తుతం ఇప్పుడు జరగబోయే గ్రూప్ -1 పరీక్షలు, నియామకాలు గతంలో ప్రకటించిన విధంగానే పాత పద్దతుల్లోనే జరుగుతాయని ప్రకటించారు.
వచ్చే దఫా నుంచి 1:100 అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు భట్టి విక్రమార్క మల్లు. నిపుణుల సలహా మేరకే దీనిపై స్పందించ లేదని అన్నారు. ఇదిలా ఉండగా ఆర్థిక నిర్వహణ,ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల శాఖ,ఐటి, ఎక్సైజ్, హోం, కార్మిక,ఉపాది, రవాణ, బీసీ సంక్షేమం, పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్ పద్దులకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.