సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదం
దావోస్ – దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో చర్చించారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందన్నారు.