అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్ – ప్రముఖ మీడియా సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్ను మూశారు. ఈ సందర్బంగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన లేని లోటు తీర్చ లేనిదని పేర్కొన్నారు. ఈనాడు సంస్థల చీఫ్ గా, ప్రియా ఫుడ్స్ , రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ , సినీ నిర్మాతగా, ఎడిటర్ గా ఇలా అనేక రకాలుగా తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ పరంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపింది. ఇదిలా ఉండగా భారత దేశ మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. ప్రధానంగా తెలుగు పత్రికా, ప్రసార మాధ్యమాలలో ఈనాడును టాప్ లో నిలిపేలా చేశారు.
ఈనాడు పత్రికను ఇంటింటికి చేర్చిన ఘనత రామోజీరావుదేనని చెప్పక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే రామోజీరావు అంటేనే తెలుగు వెలుగు. రామోజీ ఫిలిం సిటీ కూడా ఆయన నిర్మించిందే. ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడికి తరలించారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.