చిన్నం రెడ్డి..లక్ష్మయ్యలపై వేటు
రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో కొలువు తీరిన వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు ప్రభుత్వ సలహాదారులను తొలగించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా కేసీఆర్ హయాంలో అనర్హులకు అందలం ఎక్కించారన్న విమర్శలు ఉన్నాయి.
తాజాగా మరో ఇద్దరిపై వేటు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎన్ఐటీహెచ్ఎం) డైరెక్టర్ డాక్టర్ ఎస్. చిన్నం రెడ్డి, బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యలను వారి పదవుల నుండి తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా చిన్నం రెడ్డి, లక్ష్మయ్యల నియామకాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బక్కా జడ్సన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నియామక ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చిందని, కేవలం రాజకీయ కోణంలో పదవులు వీరికి కట్టబెట్టారంటూ పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సీఎం వారిని వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు.