NEWSTELANGANA

బీసీ కుల గ‌ణ‌న‌పై తీర్మానం

Share it with your family & friends

ప్ర‌వేశ పెట్టిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కోరుతూ రాష్ట్ర ర‌వాణ , బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీసీ కుల గ‌ణ‌న చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చింది పార్టీ.

ఇందులో భాగంగా మంత్రి తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. బీసీ లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి లో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించింది. అయితే బీహార్ తరహాలో సమగ్ర కులగణన చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఏపీలో ఈ కుల గ‌ణ‌న స‌ర్వే పూర్త‌యింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం జ‌నాభా దామాషా నిష్ప‌త్తి ప్ర‌కారం ఆయా వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని పేర్కొంది. దేశంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కోట 50 శాతం సీలింగ్ ఎత్తివేస్తామని ఇప్ప‌టికే హామీ ఇచ్చింది పార్టీ.

బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా కుల గణన చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చింది. అయితే న్యాయ ప‌ర‌మైన చిక్కులు లేకుండా చూడాల‌ని, తీర్మానం వెంట‌నే చేయాల‌ని బీసీ సంఘం నేత‌లు కోరుతున్నారు.