సీజేఐ ఆదేశం ఓకే చెప్పిన ప్రభుత్వం
విద్యుత్ కమిషన్ చైర్మన్ తొలగింపు
న్యూఢిల్లీ – బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరట లభించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డిని వెంటనే మార్చాలని ఆదేశించారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.
ఆయన చైర్మన్ గా ఉండేందుకు వీలు కుదరదని, న్యాయమూర్తి స్థానంలో ఉన్న వారు న్యాయం చెప్పాలే కానీ , వ్యక్తిగత కక్షతో కూడిన కామెంట్స్ చేయకూడదని, న్యాయ బద్దంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో ఒక కమిషన్ చైర్మన్ గా ఉన్న జడ్జి ఎలా మీడియా సమావేశం నిర్వహిస్తారంటూ నిలదీశారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.
వెంటనే ఆయనను మార్చాలని ఆదేశించారు. స్పష్టమైన తీర్పు చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉండ కూడదని స్పష్టం చేశారు. దీంతో సీజేఐ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే జడ్జిని మారుస్తామని కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా ఎల్. నరసింహా రెడ్డి కమిషన్ లో నియమించిన వారు కూడా ఉండకూడదని పేర్కొన్నారు సీజేఐ. త్వరలోనే చైర్మన్, సభ్యులు, విధి విధానాలను ప్రకటించాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించారు.