5 లక్షల మందికి చేకూరనున్న లబ్ది
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతకు తీపి కబురు చెప్పింది. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆన్ లైన్ లో వచ్చే నెల ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నారు దీని ద్వారా. 5 లక్షల మంది యువతకు రూ. 6 వేల కోట్ల రాయితీలు ఇవ్వనుంది సర్కార్.
ఇదిలా ఉండగా గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పలు హామీలను ఇచ్చింది. ప్రత్యేకించి అర్హత, అనుభవం కలిగిన వారికి చేయూతనిచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఇందులో భాగంగానే యువతకు మరింత సహకారం అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీని వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది లేకుండా చేయాలన్నది తమ సర్కార్ అభిమతమని ఇప్పటికే ప్రకటించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేయడం , వాటి ద్వారా ఉపాధి కల్పనకు మార్గం సుగమం అవుతుందన్నారు .