తెలంగాణలో ఐఏఎస్ లకు స్థాన చలనం
20 మందిని బదిలీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనా పరంగా కొలువు తీరి ఆరు నెలలు పూర్తి కావడం, ప్రతిష్టాత్మకమైన సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇక ఉన్నతాధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురు కీలకంగా ఉన్న వారికి ఎక్కడెక్క పోస్టింగ్ లు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేశారు.
సీఎం ఆదేశాల మేరకు పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఏకంగా 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేయడం విశేషం. బదిలీ అయిన వారిలో జగిత్యాల జిల్లా కలెక్టర్గా సత్య ప్రసాద్ , మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా విజయేంద్ర బోయిని నియమించారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ప్రతిక్ జైన్ , నల్లగొండ జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా తేజస్ నందన్ లాల్ పవార్ ను నియమించారు.
ఇక వరంగల్ జిల్లా కలెక్టర్ గా సత్య శారదా దేవి, ములుగు జిల్లా కలెక్టర్ గా టీఎస్ దివాకరా, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ ను బదిలీ చేశారు సీఎస్.