ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 27న పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మార్చి 2న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
రాష్ట్రంలో రెండు టీచర్ , ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ , మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి , నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎలక్షన్ జరగనుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జరగబోయే టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో తక్షణమే ఎన్నికల కోడ్ రానుందని ప్రకటించింది ఎన్నికల సంఘం. కాగా మెదక్ – ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ గ్రాడ్యూయేట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఇక ఇదే నిజయోకవర్గాల టీచర్ ఎమ్మెల్సీ గా కూర రఘోత్తం రెడ్డి, , వరంగల్ – నల్గొండ – ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా నర్సిరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలంలో వచ్చే మార్చి 29తో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.