మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్
విచారణ 24కు వాయిదా
హైదరాబాద్ – వివాదాస్పద నటుడు మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. తనను విచారణకు రావాలంటూ రాచకొండ సీపీ నోటీసు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ తన తరపున లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. దావాపై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం మోహన్ బాబు ఆస్పత్రిలో ఉన్నారని, దీని కారణంగా ఆయన పోలీసులు ఆదేశించినట్లు విచారణకు రాలేక పోతారని తెలిపింది. ఇందుకు సంబంధించి పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
గొడవ అనేది మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమని, అక్కడ మీడియాకు ఏం పని అంటూ ప్రశ్నించింది. పోలీసులు ఇంటి వద్ద నిఘా పెట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తనయుడు మంచు మనోజ్ , తండ్రి మోహన్ బాబు మధ్య గొడవలు చేసుకున్నాయి.
మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి పోటీగా తనకు సెక్యూరిటీ ఇవ్వాలంటూ రాచకొండ సీపిని కలిసి విన్నవించారు మోహన్ బాబు.