హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు షాక్
భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహమ్మద్ అజారుద్దీన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తన పేరుతో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నార్త్ స్టాండ్ కు ఉన్న తన పేరును తొలగించవద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన పేరును తొలగించవద్దని, తదుపరి తీర్పు చెప్పేంత వరకు అని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా హెచ్ సీఏ అంబుడ్స్ మెన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య నార్త్ స్టాండ్ కు పెట్టిన అజారుద్దీన్ పేరును తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు అసోసియేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
అజ్జూ భాయ్ కు సంబంధించిన కేసుపై వాదోపవాదనలు జరిగాయి కోర్టులో. ఈ సందర్బంగా భారత క్రికెట్ జట్టుకు విశిష్ట సేవలు అందించాడని, తన నాయకత్వంలో క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాలు అందుకుంది. అంతే కాకుండా మణికట్టు మాంత్రికుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను పొందాడు తను. ఆయన పట్ల కక్ష సాధింపు ధోరణితో ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరించిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా జస్టిస్ పల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పూర్తి గా విన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. తదుదపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు నార్త్ స్టాండ్ కు ఉన్న తన పేరు తొలగించ వద్దని ఆదేశించారు.