కేసీఆర్..హరీశ్ రావుకు హైకోర్టు ఊరట
భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు సస్పెండ్
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆదేశాలు చెల్లుబాటు కావంటూ పేర్కొన్నారు.
ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సందర్బంగా ఫిర్యాదుదారుడికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల జనవరి 7కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా మేడిగడ్డ కుంగు బాటుపై కేసీఆర్, హరీశ్ లకు నోటీసు ఇష్యూ చేసింది కోర్టు.
హైకోర్టు తమకు సంబంధించిన కేసును కొట్టి వేయడంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది కావాలని , వ్యక్తిగతంగా తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు వేసిన పిటిషన్ తప్ప మరోటి కాదన్నారు . ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
అయినా తమ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఖర్చు చేసిన ప్రతి పైసాకు సంబంధించిన లెక్కలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనిఖీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.