మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్
తుది తీర్పు 23కు వాయిదా వేసిన జడ్జి
నటుడు మంచు మోహన్ బాబుకు కోలుకోలేని షాక్ తగిలింది. తన కేసుకు సంబంధించి గురువారం విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. ఈ సందర్బంగా తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా నాట్ టు అరెస్ట్ అని పోలీసులను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు .
దానిపై సీరియస్ అయ్యింది కోర్టు. నాట్ టూ అరెస్ట్ కు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. అయితే తుది తీర్పు వెలువరించేందుకు గాను ఈనెల 23 వరకు కేసును వాయిదా వేస్తున్నట్లు తేల్చి చెప్పింది.
ఇదిలా ఉండగా ఆస్తుల పంపకం విషయంలో తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రాచకొండ సీపీని ఆశ్రయించారు మోహన్ బాబు.
ఇదిలా ఉండగా సీపీ సుధీర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మనోజ్, విష్ణులకు. రూ. ఒక లక్ష చొప్పున బాండు పేపర్లు రాయించుకున్నారు. అయినా మరోసారి పీఎస్ లో ఫిర్యాదు చేశారు మనోజ్. ఇదిలా ఉండగా మోహన్ బాబు, విష్ణులకు చెందిన గన్స్ ను సీజ్ చేయాలని ఆదేశించారు.
జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన రాద్దాంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.