పుష్ప-2 మూవీ యూనిట్ పై కోర్టు ఫైర్
అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోనా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. పుష్ప -2 మూవీ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల ఫోరం చీఫ్ సతీష్ కమాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నపళంగా టికెట్లను అమాంతం పెంచడాన్ని సవాల్ చేశారు. దీనికి ప్రభుత్వం వత్తాసు పలకడం పట్ల మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులకు సపోర్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
టికెట్ రేట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే కనీసం 8 వేల రూపాయలు ఖర్చు చేయాలా అని ఫైర్ అయ్యారు.
బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బులను నిర్మాతలు ఏం చేస్తారంటూ ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బులు ఎన్ని వచ్చాయో తమకు తెలియ చేయాలని ఆదేశించింది. ఈ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు.
పిటిషనర్ సతీష్ కమాల్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించింది. ప్రత్యేకంగా అకౌంట్ లో జమ చేయాలని ఆదేశించింది. అర్ధరాత్రి బెనిఫిట్ షో చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు ఎలా టికెట్లను కొనుగోలు చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి మీద రూ. 1000 మోపుతున్నారని ఫైర్ అయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.