అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్
ఆయనకు కూడా జీవించే హక్కు
హైదరాబాద్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి ముందు పెద్ద డ్రామా చోటు చేసుకుంది. తనను చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు అనంతరం చిక్కడపల్లి జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల పాటు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అల్లు అర్జున్ లాయర్. ఈ సందర్బంగా విచారణ జరిగింది హైకోర్టులో. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవన్న స్పష్టం చేసింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమన్న పేర్కొంది.
అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని వ్యాఖ్యానించింది హైకోర్టు. కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? రేవతి కుటుంబంపై సానుభూతి ఉందన్నారు . అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని పేర్కొంది.