NEWSTELANGANA

కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు – హైకోర్టు

Share it with your family & friends

డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు వెసులుబాటు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీల‌క తీర్పు చెప్పింది. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు కేటీఆర్ ను అరెస్ట్ చేయ‌రాదంటూ మధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే కేసుపై విచార‌ణ కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. కేటీఆర్ త‌ర‌పున ప్ర‌ముఖ లాయ‌ర్ సుంద‌రం వాదించారు.

ప్ర‌భుత్వ లాయ‌ర్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. డ‌బ్బులు చెల్లించినా కేసు ఎలా న‌మోదు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. అస‌లు కేటీఆర్ కు ఈ కేసుతో సంబంధం లేద‌ని, ఎక్క‌డ ల‌బ్ది పొందారో చెప్పాల‌న్నారు సుంద‌రం. 11 నెల‌ల త‌ర్వాత కేసు ఎలా న‌మోదు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. విచిత్రం ఏమిటంటే ప్రాథ‌మిక ద‌ర్యాప్తు జ‌ర‌ప‌కుండా కేసు రిజిస్ట‌ర్ ఎలా చేస్తార‌ని, ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

అఫెన్స్ జ‌రిగింద‌ని తెలిశాక మూడు నెల‌ల లోపే కేసు న‌మోదు చేయాల్సి ఉంటుంద‌న్నారు. అక్టోబ‌ర్ 2023లో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఎఫ్ఈఓకు డ‌బ్బులు చెల్లించార‌ని, ఇందులో త‌ప్పు ఏముంద‌న్నారు లాయ‌ర్ సుంద‌రం. అగ్రిమెంట్ ప్ర‌కారం చెల్లింపులు జ‌రిపితే ఉల్లంఘ‌న ఎలా అవుతుందో స‌ర్కార్ లేదా ఏసీబీ చెప్పాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *