లగచర్ల ఘటనలో 24 మందికి బెయిల్
కీలక తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
ఓ రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్బంగా హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. రైతుల పట్ల ఇలా వ్యవహరించడం మంచిది కాదని పేర్కొంది. ప్రధానంగా పోలీసులు అనుసరించిన తీరు పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
అంతే కాకుండా రైతుకు బేడీలు వేయడం అనేది సీరియస్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయనకు సంబంధించిన సోదరులు, అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశించాలని సూచించింది.
మరో వైపు జిల్లా కలెక్టర్ పై దాడికి తాము దిగలేదని, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి తాను ఎలా ఇక్కడికి వస్తారంటూ గ్రామస్తులు, రైతులు ప్రశ్నించారు.