DEVOTIONAL

ల‌డ్డూ క‌ల్తీ బాధ్యుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాలి

Share it with your family & friends

తెలంగాణ హైకోర్టు న్యాయ‌వాదుల ఆందోళ‌న‌

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం చ‌ర్చ‌కు దారి తీసిన ప్ర‌స్తుత త‌రుణంలో తెలంగాణ హైకోర్టు న్యాయ‌వాదులు రోడ్డెక్కారు. దీనిపై వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ హైకోర్టు వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు.

హైకోర్టుకు చెందిన న్యాయ‌వాదులు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ ముందు ఆందోళ‌న చేప‌ట్టారు. కోట్లాది మంది భ‌క్తులు నిత్యం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను కొలుస్తార‌ని, గ‌త కొంత కాలంగా తిరుమ‌ల క్షేత్రం ప‌ట్ల నిర్లక్ష్యం కొన‌సాగుతూ వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌మ ఆరాధ్య దైవ‌మైన తిరుమ‌ల క్షేత్రాన్ని అప‌విత్రం చేస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. భక్తులకు అత్యంత ఇష్టమైన పవిత్రమైన లడ్డును కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తుల విషయంలో తాత్సారం చేయొద్దంటూ కోరారు.

వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలియ చేశారు. ఏ స్థాయిలో ఉన్నా , ఎంత‌టి నాయ‌కులైనా వెంట‌నే వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న్యాయ‌వాదులు డిమాండ్ చేశారు.