తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పుష్ప-2 మూవీ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినిమా థియేటర్లకు 16 ఏళ్ల లోపు వయస్సు కలిగిన పిల్లలను సెకండ్ షోస్ కు అనుమతించ వద్దని ఆదేశించింది. ప్రభుత్వం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ సతీష్ కమాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.
ఇదే సమయంలో విచారణ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేసింది కోర్టు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఉందంటూ ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించాలని, ఎలా పడితే అలా పర్మిషన్స్ ఎలా ఇస్తారంటూ మండిపడింది.
ఇదిలా ఉండగా సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ మాట్లాడుతూ సినిమాలకు సంబంధించి తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ మూవీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.