హైడ్రా కూల్చివేతలపై కోర్టు కన్నెర్ర
కమిషనర్ రంగనాథ్..తహసిల్దార్ పై ఫైర్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. ప్రధానంగా హైడ్రా దూకుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమిన్ పూర్ తహసిల్దార్ పై కోర్టు నిప్పులు చెరిగింది.
ఆదివారం సెలవు దినం కావడంలో కూల్చివేతలు చేయొద్దని గతంలో తాము ఆదేశాలు ఇచ్చామని, వాటిని మీరు పాటించకుండా కూల్చివేతలు చేయడం సరికాదని పేర్కొంది.
కూల్చే టైమ్ ఉంది కానీ కోర్టు ఆర్డర్ చదివే టైమ్ లేదా??అందరినీ చంచల్ గూడ, చర్లపల్లికి పంపిస్తే వింటారంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.
చేసిందంతా తప్పే మళ్లీ ఆర్గ్యూ ఎందుకు చేస్తున్నావు అంటూ ఎమ్మార్వో కి చురక లంటించింది. పొలిటికల్ బాసుల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించింది.
పెద్దల పట్ల ఒకలా, పేదల పట్ల ఒకలా పని చేయకూడదని సూచించింది. ఒక దశలో హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన GO 99 ను రద్దు చేస్తాం అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మొదట్లో హైడ్రాను మేము స్వాగతించామని, కానీ హైడ్రా పని తీరు తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు.