పర్మిషన్ ఇచ్చిన అధికారులపై ఫైర్
అధికారుల ఆస్తులు జప్తు చేయండి
హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. బఫర్ జోన్ అని తెలిసినా ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నించింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది కోర్టు.
ఒక బాధ్యత కలిగిన అధికారులై ఉండి ఇలా ఎలా వ్యవహరిస్తారంటూ వ్యాఖ్యానించింది. అనుమతులు ఇచ్చిన వారి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అని తెలిసి కూడా నిర్మాణాలకు అనుమతులు ఇస్తారా అంటూ అధికారులపై కోర్టు నిప్పులు చెరిగింది.
శంషాబాద్ నార్కుడ గ్రామంలో FTL, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సచిన్ జైస్వాల్.
అధికారులే అనుమతులు ఇచ్చి అక్కడ నిర్మాణాలు జరిగిన తర్వాత కూల్చి వేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది హైకోర్టు.