మెడికల్ పీజీ అభ్యర్థులు స్థానికులే
సంచలన తీర్పు వెలువరించిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మెడికల్ పీజీ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వారిని స్థానికులుగా పరిగణించాలని స్పష్టం చేసింది ధర్మాసనం. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లుబాటు కాదని పేర్కొంది. దీంతో రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది.
గత కొంత కాలంగా ప్రభుత్వం తలతిక్క పనులు చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా హైడ్రా విషయంలో సైతం చేపట్టిన చర్యలను తీవ్రంగా తప్పు పట్టారు జడ్జి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించారు.
పేరుకు తెలంగాణ ప్రభుత్వమైనా మొత్తం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే పాలన సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన , తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లను ఇక్కడ నియమించారు.
సోయి లేని సీఎం ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు తీరడం, దానికి చంద్రబాబు మద్దతు ఇవ్వడంతో ఆయన శిష్యుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు ప్రజలలో ఆగ్రహాన్ని తెప్పించేలా చేస్తోంది.