Friday, April 4, 2025
HomeNEWS17 జిల్లాల్లో భానుడి ప్ర‌తాపం

17 జిల్లాల్లో భానుడి ప్ర‌తాపం

జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న వాతావ‌ర‌ణ శాఖ

హైద‌రాబాద్ – తెలంగాణ వాసుల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ‌. గురువారం నుంచి ఈనెల 18వ తేదీ వ‌ర‌కు వ‌డ గాలులు వీస్తాయ‌ని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. వీలైనంత మేర అవ‌స‌రం ఉంటేనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని సూచించింది. ఎవ‌రూ కూడా అత్యుత్సాహంతో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇబ్బందులు ప‌డ‌వ‌ద్ద‌ని సూచించింది. ఆయా ఆఫీసులు, విద్యా సంస్థ‌లు, ఇత‌ర కార్యాల‌యాల్లో క‌నీస వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేసేలా చూడాల‌ని స్ప‌ష్టం చేసింది సీఎస్ శాంతి కుమారి. ప్ర‌త్యేకించి పాఠాశాల‌ల్లో చ‌దువుకునే పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించింది. చిన్నారులు ఎక్కువ‌గా ఎండ వేడిమికి గుర‌య్యే ఛాన్స్ ఉందంటూ పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments