పవన్ రాక కోసం భారీ ఏర్పాట్లు
డిప్యూటీ సీఎంగా జనసేనాని
తెలంగాణ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 29న శనివారం తెలంగాణలో ప్రసిద్ది చెందిన కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించు కోనున్నారు. ఈ సందర్బంగా భారీ ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్ , ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ రాజలింగం , వేణు, సమన్వయ కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ , కోదాడ ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి , దామోదర్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జనసేన నాయకులు అంజన్నను దర్శించుకున్నారు.
అనంతరం రాష్ట్ర నాయకులు ఇవాళ జరగ బోయే కార్యక్రమాలను ఆలయ కార్య నిర్వహణ అధికారితో కలిసి పర్యవేక్షించారు. జిల్లా నాయకులకు సూచనలు ఇస్తూ దిశా నిర్దేశం చేశారు. పోలీసు శాఖ వారిని కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కార్యకర్తలను , అభిమానులను తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా, సమ్యమనంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా శంకర్ గౌడ్ కోరారు.