తెలంగాణలో హస్తం వర్సెస్ కమలం
8 సీట్లలో కాంగ్రెస్ 8 సీట్లలో బీజేపీ ఎంఐఎం 1
హైదరాబాద్ – తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతున్నాయి. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను 8 సీట్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో మరికొన్ని సీట్లను కైవసం చేసుకునే దిశగా సాగుతుండడం విశేషం.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నియోజకవర్గం హైదరాబాద్. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బరిలో నిలిచన ఈ సీటులో నువ్వా నేనా అని కొనసాగుతోంది. ఇక ఇక్కడ బీజేపీ తరపు నుంచి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇచ్చింది.
మొత్తం లోక్ సభ స్థానాలలో విచిత్రమైన ఫలితాలు రాబోతున్నాయి. సీఎం స్వంత ప్రాంతం పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగులుతోంది. ఇక్కడ ఏరికోరి ఎంపిక చేసిన వంశీ చందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇంకా పలు రౌండ్లు మిగిలి ఉన్నాయి.
అంతా అనుకున్నట్టుగానే బీజేపీ 7 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 8 సీట్లలో ముందంజలో ఉంది. మెదక్ లో బీఆర్ఎస్ , హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉన్నాయి.