లక్ష దాటిన మహిళా సభ్యత్వాలు
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా సభ్యత్వాలు లక్ష దాటాయి. ఈ సందర్బంగా గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్బంగా సునీతా రావును ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలను అవమానించారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. సీఎం ఆధ్వర్యంలో పాలన సూపర్ గా ఉందన్నారు.
తమ నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని చెప్పారు సునీత రావు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఇవాళ లక్ష సభ్యత్వంతో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సునీతా రావు.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబడి పోయిందన్నారు. కానీ తాము వచ్చాక ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.