NEWSTELANGANA

రేవంత్ రెడ్డికి అభినంద‌న‌ల వెల్లువ‌

Share it with your family & friends

మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు కంగ్రాట్స్

హైద‌రాబాద్ – అమెరికా, సౌత్ కొరియా ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ కు విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న‌కు ఘ‌నంగా స్వాగ‌తం ల‌భించింది. 10 రోజుల పాటు టూర్ కొన‌సాగింది. భారీ ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో స‌క్సెస్ అయ్యారు సీఎం.

ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సాగింది. 50 కిపైగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, ముఖాముఖి కొన‌సాగింది.

ముఖ్యంగా నెట్ జీరో సిటీ, ఏఐ సీటీ, స్కిల్స్ యూనివ‌ర్శిటీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ వంటి అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌, డేటా సెంటర్స్‌ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, కాస్మటిక్స్, టెక్స్‌టైల్‌, ఎలక్ట్రిక్‌ వాహన రంగాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న సానుకూలతలను వివరించారు.

త‌న నివాసానికి చేరుకున్న ఎ. రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.