NEWSTELANGANA

న‌ర్సింగ్ ఆఫీస‌ర్ల ఆందోళ‌న

Share it with your family & friends

బ‌దిలీల్లో చేతులు మారిన డ‌బ్బులు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. పాల‌నా ప‌రంగా ఇటు ఉద్యోగులు అటు నిరుద్యోగులు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జా ప్ర‌భుత్వం అని చెప్పుకుంటున్నా ఆచర‌ణ‌లో అది క‌నిపించ‌డం లేదు. తాజాగా హైద‌రాబాద్ లో న‌ర్సింగ్ ఆఫీస‌ర్ , సీనియ‌ర్ న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు రోడ్డెక్కారు. ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పోస్టింగ్ కౌన్సెలింగ్ లో భాగంగా పోస్టింగ్ లు ఇచ్చే విష‌యంలో తీవ్ర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, పోస్టింగ్ కోసం డ‌బ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్య‌త ఇచ్చారంటూ న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జారీ చేసిన జీవో లోనే త‌ప్పులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. సాధార‌ణ బ‌దిలీల‌కు సంబంధించి 40 శాతం సిబ్బందికి ఛాన్స్ ఇస్తామ‌న్నార‌ని, కానీ కేవ‌లం 4 ఏళ్లు నిండిన వారికి ప్ర‌యారిటీ ఇచ్చారంటూ ఆరోపించారు.

సీజనల్ వ్యాధుల కీల‌క స‌మ‌యంలో ఇలా ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున బ‌దిలీలు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు. కౌన్సెలింగ్ పేరుతో హెడ్ నర్స్ , ఆపై స్థాయిలో ఉండే అధికారులు తాము కోరుకున్న పోస్టింగ్ ల కోసం డ‌బ్బులు ఆశిస్తున్నారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో గంద‌ర గోళం నెల‌కొంది. త‌మ‌కు న్యాయం చేయాలంటూ హైద‌రాబాద్ లోని కోఠి ప్ర‌ధాన ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది.