బహిరంగ మద్యపానం నేరం
ప్రకటించిన తెలంగాణ పోలీస్
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మందు బాబులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని విచ్చల విడిగా అమ్మేలా చేసింది. ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రస్తుతం జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సైతం మద్యం పై వచ్చే ఆదాయంపై ఆధారపడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అంటేనే మద్యానికి కేరాఫ్ గా మారి పోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఓ వైపు మద్యం ఇంకో వైపు మర్డర్లు, మాన భంగాలు , డ్రగ్స్ ..ఇలా చెప్పుకుంటూ పోతే పోరు గడ్డగా పేరొందిన తెలంగాణ ఇప్పుడు అన్నింటికీ కేరాఫ్ గా మారింది.
ఈ తరుణంలో ఎక్కడ పడితే అక్కడ వైన్స్ షాప్స్ ఉన్నాయి. మందు బాబులు 24 గంటలు మద్యాన్ని సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీంతో తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన చేసింది. బహిరంగంగా మద్యపానం చేస్తే 6 నెలల పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.