మోహన్ బాబు గాయబ్
పోలీసుల గాలింపు
హైదరాబాద్ – అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు నటుడు మంచు మోహన్ బాబు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు.. మోహన్‌బాబు స్టేట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు షాక్ తగిలింది. ఆయన నిన్నటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తనను పట్టుకునేందుకు రంగంలోకి ఐదు పోలీసు బృందాలు దిగాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా జల్ పల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఇంట్లో కుటుంబ గొడవలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. తొలుత మంచు మనోజ్ తండ్రిపై పహాడి షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆయనకు పోటీగా మోహన్ బాబు రాచకొండ సీపీని కలిసి తనకు ప్రాణహాని ఉందని, సెక్యూరిటీ కల్పించాలని కోరారు.
మంచు విష్ణు, మంచు లక్ష్మి సైతం రంగంలోకి దిగారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని. మనోజ్, విష్ణులకు వార్నింగ్ ఇచ్చింది. వెపన్సన్ ను సీజ్ చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. దీంతో నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో గత్యంతరం లేక జంప్ అయ్యారు మోహన్ బాబు.