15న తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడి
2 లక్షల జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి
హైదరాబాద్ – రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల జాబ్స్ ను వెంటనే భర్తీ చేయాలని, డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 15న సోమవారం సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ సందర్బంగా పోస్టర్ ను ఆవిష్కరించారు రాజ్యసభ సభ్యుడు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్స్ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని హెచ్చరించారు.
గత కొంత కాలంగా పరీక్షల తేదీలు మార్చాలని, కొంత సమయం ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. వారి న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
మరో వైపు అశోక్ నగర్ చౌరస్తా, దిల్ షుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. అయినా సర్కార్ కు , సీఎంకు సోయి లేక పోవడం దారుణమన్నారు . ఇప్పటికైనా కళ్లు తెరిచి వాయిదా వేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.