సీతక్క వీడియో మార్ఫింగ్ పై సీరియస్
విచారణ చేపట్టాలని స్పీకర్ ఆదేశం
హైదరాబాద్ – రాష్ట్ర గిరిజన , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్కపై వీడియో మార్ఫింగ్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది శాసన సభలో. ఈ సందర్బంగా సదరు ఫేక్ వీడియో తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.
ఈ మేరకు రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు చెప్పారు స్పీకర్.
ఈ సందర్బంగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇలాంటి వ్యక్తిగత హనానికి గురి చేసే కామెంట్స్ , వీడియోలు షేర్ చేయడాన్ని తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
సీతక్క మీద ట్రోలింగ్ చేస్తే చర్యలు తీసుకోకూడదా అని నిలదీశారు. ప్రతిపక్ష సభ్యులు చర్యలు తీసుకోవద్దు అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.