Tuesday, April 22, 2025
HomeNEWSపదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

వ‌చ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం

హైద‌రాబాద్ – తెలంగాణ విద్యా శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయని వెల్ల‌డించింది ఎస్‌ఎస్‌సీ బోర్డు . విద్యార్థులు చ‌దువుపై శ్ర‌ద్ద పెట్టాల‌ని సూచించింది. మ‌రో వైపు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున పేద కుటుంబాల‌కు చెందిన పిల్ల‌లు క‌స్తూర్బా గాంధీ విద్యాల‌యాల‌లో చ‌దువుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న బాట ప‌ట్టిన ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్ట‌క పోవ‌డం తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు స్టూడెంట్స్.

విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల‌ని ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి నుంచే ఎగ్జామ్స్ కు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని పేర్కొంది. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు వీటిపై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించింది బోర్డు. ఒక‌వేళ ఎస్ఎస్ఏ ఉద్యోగుల స‌మ్మె బంద్ కాక పోయిన‌ట్ల‌యితే ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments