వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీస్
22న హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ – తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య, శోభిత విడి పోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యోతిష్కుడు వేణు స్వామి. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. మా అసోసియేషన్ కూడా అభ్యంతరం తెలిపింది. ప్రత్యేకించి సినిమా వాళ్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయొద్దంటూ మా అధ్యక్షుడు విష్ణు కోరినట్లు సమాచారం.
ఇది పక్కన పెడితే ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు. వేణు స్వామికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 22న తమ కమిషన్ ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తన భర్త వేణు స్వామి మాట్లాడిన దాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించారు భార్య వాణి . ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఓ వీడియోను కూడా షేర్ చేశారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెందుకు నాగ చైతన్య, శోభితకు సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మొత్తంగా వేణు స్వామి వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన సింగపూర్ లో సేద దీరుతున్నట్లు సమాచారం.