మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – కుల గణన సర్వేతో భవిష్యత్తుకు కొత్త శకం మొదలైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవనుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణను మొచ్చుకున్నారని చెప్పారు. బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. కేవలం 50 రోజుల్లోనే సమగ్ర ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు.
అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి ఎలాంటి సర్వే చేపట్ట లేదని ఆరోపించారు అసెంబ్లీలో సర్వే వివరాలు ప్రకటించారు. మొత్తం 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మందిని సర్వే చేశామన్నారు. ఎస్సీలు 17.43 శాతం , ఎస్టీలు 10.45 శాతం , బీసీలు 46.25 శాతం ఉన్నారని తెలిపారు. గతంలో సరైన లెక్కలు లేవన్నారు.
ఎవరికి తోచిన రీతిలో వారు లెక్కలు వేసుకున్నారంటూ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా జనాభా లెక్కించినా బీసీల గురించి పట్టించు కోలేదన్నారు. బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగలేదని వాపోయారు.. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే.. కులగణన చేయాలని రాహుల్ గాంధీ భావించారని చెప్పారు సీఎం.