Thursday, April 17, 2025
HomeNEWSతెలంగాణ టెట్ రిజ‌ల్ట్స్ రిలీజ్

తెలంగాణ టెట్ రిజ‌ల్ట్స్ రిలీజ్

విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగిత

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో టెట్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగిత రిజ‌ల్ట్స్ రిలీజ్ చేశారు. టెట్ ఫ‌లితాల్లో 42 వేల 384 మంది అభ్య‌ర్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ ఉండ‌డంతో టెట్ ఫ‌లితాలు వాయిదా వేస్తున్న‌ట్లు తొలుత ప్ర‌క‌టించారు. కానీ ముందే ప‌రీక్ష నిర్వ‌హించ‌డం వ‌ల్ల అభ్యంత‌రం ఉండ‌దంటూ ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. దీంతో స‌ర్కార్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.

ఇక టెట్ రిజ‌ల్ట్స్ కు సంబంధించి మొత్తం 31.21 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌డం విశేషం. కాగా జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్ లో జరిగిన టెట్ పరీక్షల్లో 1,35,82 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.

పేపర్ -1 లో 69, 476 మంది పరీక్ష రాస్తే 41 ,327 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 69,390 మంది పరీక్ష రాస్తే 23,755 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్ లో 66,412 మంది ఎగ్జామ్ రాస్తే 18,629 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 1 అండ్ 2 లో కలిపి 1,35,802 మంది పరీక్షలు రాస్తే 42,384 మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లోను అందుబాటులో ఉంచారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments