NEWSTELANGANA

సీఎంకు రుణ‌ప‌డి ఉన్నాం – ట్రాన్స్‌జెండర్లు

Share it with your family & friends

వాలంటీర్లుగా నియ‌మిస్తుండ‌డం ప‌ట్ల థ్యాంక్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ర‌హ‌దారుల‌పై యాచ‌న చేసుకునే ట్రాన్స్ జెండ‌ర్ల‌కు తీపి క‌బురు చెప్పారు. వారికి స‌మాజంలో స‌మున్న‌త‌మైన గౌర‌వం క‌ల్పించేందుకు గాను కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ట్రాన్స్ జెండ‌ర్లను ప్ర‌త్యేక వాలంటీర్లుగా (ప్ర‌భుత్వ ప‌రిధిలో) నియ‌మించాల‌ని ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా త‌మ‌ను మ‌నుషులుగా గుర్తించ‌డం, గౌర‌వాన్ని క‌ల్పించ‌డం, ప్ర‌త్యేకంగా త‌మ‌కు జీవనోపాధి క‌ల్పించేందుకు కృషి చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు ట్రాన్స్ జెండ‌ర్లు.

ఇదిలా ఉండగా ట్రాన్స్ జెండ‌ర్ల‌ను వాలంటీర్లుగా నియ‌మించేందుకు విధి విధానాల‌ను ఖ‌రారు చేయాల‌ని, హోం గార్డుల మాదిరిగానే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్, వేతనాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సహాయం చేస్తామ‌ని ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు. ఇచ్చిన హామీ మేర‌కు ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించడంపై దృష్టి పెట్టాలని స్ప‌ష్టం చేశారు.