NEWSTELANGANA

డీఎస్సీ ప‌రీక్ష వాయిదా వేయాల‌ని దావా

Share it with your family & friends

హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన నిరుద్యోగుల

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు హైకోర్టును ఆశ్ర‌యించారు. గురువారం కోర్టులో ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌మ న్యాయ ప‌ర‌మైన డిమాండ్ ను ప్ర‌స్తుత రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప‌ట్టించు కోవ‌డం లేద‌ని వాపోయారు. మ‌రో వైపు ప్ర‌జా పాల‌న అంటూ ర‌జాకార్ల పాల‌న‌ను గుర్తుకు తెస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎలాంటి ముంద‌స్తు ప్లాన్ లేకుండానే డీఎస్సీ ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు నిరుద్యోగులు. అందుకే తాము కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. డీఎస్సీ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ 10 మంది దావాను దాఖ‌లు చేశారు.

ప‌రీక్ష‌లు వెంట‌నే వాయిదా వేసేలా స్టేట‌స్ కో ఇవ్వాల‌ని, కొత్త నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం నిరుద్యోగుల డిమాండ్ ను బేఖాత‌ర్ చేస్తూ ముందుకే వెళ్లింది. ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒళ్లు బ‌లిసి ఆందోళ‌న చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. జూలై 18 నుండి డీఎస్సీ ప‌రీక్ష‌లు ప్రారంభం కావ‌డం విశేషం.