DEVOTIONAL

సీఎంను క‌లిసిన విద్య‌త్ సభ బృందం

Share it with your family & friends

2025-26 పండుగుల జాబితా అంద‌జేత

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని సోమ‌వారం ప్ర‌జా భ‌వ‌న్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు తెలంగాణ విద్య‌త్ స‌భ ప్ర‌తినిధులతో కూడిన బృందం.

తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు, సిద్ధాంతులు ధర్మ శాస్త్రాలకు అనుగుణంగా చర్చించి, నిర్ణయించి, ఆమోదించిన విశ్వావసు నామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను త‌యారు చేశారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసెంబ్లీ లోని వారి కార్యాలయంలో అందించారు.

సీఎంను క‌లిసిన వారిలో రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, దేవాదాయ , ధ‌ర్మాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా రామ‌య్య‌ర్, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హ‌నుమంత రావు, తెలంగాణ విద్వత్ సభ ప్రతినిధులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యుత్ స‌భ ప్ర‌తినిధుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌చ్చే ఏడాదిని పుర‌స్క‌రించుకుని ముందే పండుగ‌ల జాబితాను త‌యారు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. దేవాల‌యాల అభివృద్దికి ఇతోధికంగా త‌మ స‌ర్కార్ కృషి చేస్తుంద‌ని హామీ ఇచ్చారు.