చికెన్ ప్రియులకు కోలుకోలేని షాక్
తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లకు సోకిందని, దీంతో కొన్ని రోజుల పాటు చికెన్ ఎవరూ తినవద్దంటూ హెచ్చరించింది ప్రజలను. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాపించడంతో అలర్ట్ అయ్యాయి ప్రభుత్వాలు. జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించాయి.
ఇప్పటికే ఏపీలో బర్డ్ ఫ్లూ దెబ్బకు లక్షల కోళ్లు మృత్యువాతకు గురయ్యాయి. ఏపీ సర్కార్ అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కోళ్లకు సంబంధించిన ఘటనపై ఆరా తీశారు. కొంత కాలం పాటు చికెన్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతితో ఫోన్ లో మాట్లాడారు మంత్రి. ఈ సందర్బంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ సమాధానం ఇస్తూ ఇప్పటికే కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఎక్కడ కూడా కోళ్లు అమ్మరాదని ఆదేశాలు జారీ చేశామన్నారు.