ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవితపై కన్నెర్ర చేశారు. బీసీలతో కవితకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల గురించి ఆమె తగ హడావుడి చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు పవర్ పోయాక గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆది శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడారు. బీసీలను మోసం చేసింది మీరేనంటూ మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు, కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. బీసీలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు.
బీసీలపైన మొసలి కన్నీరు, కపట ప్రేమ చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందంటూ నిలదీశారు. ఆనాడు కవిత ఒక్కసారైనా మాట్లాడారా అని అన్నారు. దేశానికి కుల గణనలో తమ సర్కార్ రోల్ మోడల్ గా మారిందని చెప్పారు.
ఇప్పుడు బీఆర్ఎస్ నేతల గాలి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఇకనైనా కొంచెం తగ్గితే మంచిదంటూ కవితకు హితవు పలికారు ఆది శ్రీనివాస్ .