మోదీ సర్కార్ బేకార్
యూత్ కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్ – మోదీ ప్రభుత్వం గంప గుత్తగా వ్యాపారవేత్తలు, బడా కంపెనీలు, కార్పొరేట్ శక్తులకు దాసోహమైందని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. శనివారం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా మోదీపై నిప్పులు చెరిగారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా కేంద్రం విఫలమైందని, ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి కొత్త రాజకీయాలకు తెర లేపారంటూ ఆరోపించారు. కులం, మతం పేరుతో ఓట్లను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి సంబంధించిన వనరులను, ఆస్తులను గంప గుత్తగా ధారదత్తం చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ మోదీపై మండిపడ్డారు. ఆయన ప్రచారంపై ఫోకస్ పెట్టడం తప్ప దేశం గురించి, సమస్యల పరిష్కారం గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తానన్న ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.