NEWSTELANGANA

త్వ‌ర‌లో తెలంగాణ‌లో రేష‌న్ కార్డులు

Share it with your family & friends

అర్హులంద‌రికీ ఇస్తామ‌న్న ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ తెల్ల రేష‌న్ కార్డులు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.

ఇందులో భాగంగా తెల్ల రేష‌న్ కార్డుల‌కు సంబంధించి విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది. ఎవ‌రికి తెల్ల రేష‌న్ కార్డులు ఇస్తామ‌నే దానిపై క్లారిటీ ఇచ్చింది ప్ర‌భుత్వం. గ్రామీణ ప్రాంతాల‌లో రూ. 1,50,000 , ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో రూ. 2,00,000 ల‌క్ష‌లు లోపు వార్షిక (ఏడాది) ఆదాయం ఉన్న వారికి తెల్ల రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు ఉన్న వారు తెల్ల రేష‌న్ కార్డులు పొందేందుకు అర్హుల‌ని స్ప‌ష్టం చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.

ఇక పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా తెల్లరేషన్‌ కార్డులు. ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్‌ కార్డుల అర్హతపై పరిశీలన చేస్తామ‌ని తెలిపింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెల్ల రేష‌న్ కార్డుల‌ను వెంట‌నే జారీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం.