దురోవ్ అరెస్ట్ తో టెలిగ్రామ్ కు ప్రజాదరణ
ఊహించని రీతిలో ఖాతాదారుల చేరిక
ఫ్రాన్స్ – ప్రముఖ మెస్సెంజర్ సంస్థ టెలిగ్రామ్ కు భారీ ఎత్తున ప్రజాదరణ లభించడం విస్తు పోయేలా చేస్తోంది. టెలిగ్రామ్ ఫౌండర్ , సీఈవో పావెల్ దురోవ్ పై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రష్యా. తన స్వస్థలం రష్యా. దీంతో రష్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తను ఫ్రాన్స్ లో స్థిర పడ్డారు. అయితే టెలిగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున సమాచారం సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ తరుణంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉంటున్న పావెల్ దురోవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టెలిగ్రామ్ కు జనాదరణ తగ్గుతుందని, దాని షేర్స్ పడి పోతాయని అంతా భావించారు. సాంకేతిక నిపుణులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అనలిస్టులు సైతం ఇదే అంచనాతో ఉన్నారు.
కానీ వారందరినీ విస్తు పోయేలా , ఆశ్చర్య పరిచేలా టెలిగ్రామ్ కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. భారీ ఎత్తున టెలిగ్రామ్ లో ఖాతాదారులుగా మారి పోయారు. ప్రస్తుతం టెలిగ్రామ్ ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ తో పోటీ పడుతోంది. కోట్లాది మంది టెలిగ్రామ్ ను వాడుతున్నారు.