ప్రతి తెలుగు వాడు పారిశ్రామికవేత్త కావాలి
పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్
అమెరికా – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నది బాబు నాయుడు ఆశయమన్నారు. ఎపిఎన్ఆర్ టి ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు స్కిల్ శిక్షణ ఇస్తామని చెప్పారు.
ప్రతి తెలుగు వాడు ఎంటర్ ప్రెన్యూర్ కావాలని పిలుపునిచ్చారు. అమెరికా ఎక్కువ తలసరి ఆదాయం తెలుగు వారిదేనని. ఎన్ఆర్ఐలు ఏపీలో పెట్టుబడి పెట్టాలని కోరారు. మీకు అండగా నిలచే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగాలిస్తేనే మనం మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడతామని అన్నారు.
ఇందుకు ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి సైకోకి ఐదేళ్లు పట్టిందన్నారు. చంద్రబాబు మూడు వేల పెన్షన్ ను ఒకే ఒక్క సంతకంతో నాలుగు వేలు చేశారని చెప్పారు నారా లోకేష్.
వైసిపి హయాంలో ఒక్క డిఎస్సీ వెయ్య లేదన్నారు. మనం 16,500 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహిస్తున్నామని అన్నారు. సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. దీపావళి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు గ్యాస్ సీలిండర్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు నారా లోకేష్.