Thursday, April 17, 2025
HomeNEWS50 రోజుల్లోనే స‌ర్వే పూర్తి చేశాం

50 రోజుల్లోనే స‌ర్వే పూర్తి చేశాం

మంత్రులు ఉత్త‌మ్..పొన్నం

హైద‌రాబాద్ – కుల గణనపై ఇచ్చిన మాట ప్రకారం సర్వే నిర్వహించామ‌న్నారు మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్. రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో సర్వే జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

స్వ‌తంత్ర భార‌త దేశంలో ఈ స్థాయిలో స‌ర్వే ఎక్క‌డా నిర్వ‌హించ లేద‌న్నారు. 50 రోజుల్లోనే స‌ర్వే పూర్తి చేశామ‌ని చెప్పారు. 4న జ‌రిగే కేబినెట్ భేటీలో స‌ర్వేను ప్ర‌వేశ పెడ‌తామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ‌లో ఇది సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించద‌గిన రోజన్నారు.

కుల గణనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నామ‌న్నారు. స‌ర్వే విష‌యంలో స‌ర్కార్ చిత్త‌శుద్దిగా ప‌ని చేసింద‌న్నారు. స‌ర్వేకు సంబంధించి పూర్తి నివేదిక‌ను విడుద‌ల చేశారు. తెలంగాణ రాష్ట్ర జ‌నాభా 3,54,77,554 కోట్ల‌ని తేల్చారు. బీసీలు 56.33..ఎస్సీలు 17.43 ..ఎస్టీలు 10. 45 శాతమ‌ని తేల్చారు.

మొత్తం జ‌నాభాలో 1,12,15,134 కుటుంబాలు కాగా , ఎస్సీల జ‌నాభా 61,84,319 ఉండ‌గా 17.43 శాతంగా ఉంది. ఎస్టీల జ‌నాభా 37,05,929 ఉండ‌గా 10.45 శాతంగా ఉంది. బీసీల జ‌నాభా 1,64,09,179 ఉండ‌గా రాష్ట్ర జ‌నాభాలో 46.25 శాతంగా ఉంగా. ఓసీల జ‌నాభా 15.79 శాతం కాగా 10.8 ముస్లిం, బీసీల‌ను క‌లిపితే రాష్ట్రంలో 56.33 శాతంగా ఉండ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments