Sunday, April 20, 2025
HomeENTERTAINMENTనేడే ప‌వ‌న్ తో నిర్మాత‌ల భేటీ

నేడే ప‌వ‌న్ తో నిర్మాత‌ల భేటీ

చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ప్ర‌ముఖ న‌టుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ను విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో జూన్ 24న సోమ‌వారం కలవనున్నారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు..

కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించే ప్ర‌య‌త్నం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావ‌న‌కు రానున్న‌ట్లు స‌మాచారం.

పవన్ కళ్యాణ్ ను ఇవాళ కలిసే వారిలో ప్ర‌ముఖ నిర్మాత‌లు చ‌ల‌సాని అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ , రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments