తెలుగు అమ్మాయిలు అరెస్ట్
యుఎస్ లో పోలీసుల దారుణం
అమెరికా – డాలర్ల మాయలో పడి కొట్టుకు చస్తున్న తెలుగు వారికి కనువిప్పు కలిగించేలా చోరీ ఘటన చోటు చేసుకుంది యుఎస్ లో. చదువు కునేందుకు వెళ్లిన ఆ ఇద్దరు సరదా కోసమని బిల్లు చెల్లించ లేదు. అమెరికాలోని షాప్ లో చోరీకి పాల్పడ్డారంటూ సదరు షాప్ ఓనర్ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. విచిత్రం ఏమిటంటే వారు అమ్మాయిలు కావడం గమనార్హం.
దారుణంగా ఆ ఇద్దరిని చేతులు వెనక్కి కట్టి బంధించారు అక్కడి పోలీసులు. దీని పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ ఒక్క సంఘటనే కాదు అమెరికాలో భారతీయుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది అక్కడి సర్కార్. పైకి తేన లాంటి మాటలు మాట్లాడుతూనే ఇంకో వైపు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు లేక పోలేదు.
అయితే తాము తెలియక చేశామని, అంతకు రెట్టింపు ఇస్తామని కోరారు. నేరాన్ని పునరావృతం చేయొద్దని కోరారు. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకరు న్యూ జెర్సీలో చదువుకుంటున్న హైదరాబాద్ కు చెందిన ఒకరు కాగా మరొకరు గుంటూరుకు చెందిన అమ్మాయి.
బాలికలు తాము కొనుగోలు చేసిన కొన్ని వస్తువులకు డబ్బులు చెల్లించ లేదని హోబోకెన్ షాప్ ఓనర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.