NEWSTELANGANA

తెలుగు ఎంపీలు బిలియ‌నీర్లు

Share it with your family & friends

పార్థ సార‌థి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు

హైద‌రాబాద్ – ఎవ‌రీ బండి పార్థ సార‌థి రెడ్డి అనుకుంటున్నారా. మ‌నోడు రాజ్య స‌భ స‌భ్యుడు. దేశంలోనే రాజ్య‌స‌భ ఎంపీల‌లో అత్యంత ధ‌నికుడిగా తేలాడు. ఏకంగా మ‌నోడి ఆస్తి రూ. 5,300 కోట్లు. కేసీఆర్ నేతృత్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన రెడ్డి నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌డం విశేషం.

ఇక ఏపీకి చెందిన యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామి రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయ‌న ఆస్తి రూ. 2,577 కోట్లు. రాజ్య స‌భ ఎంపీల‌లో నెంబ‌ర్ 2గా నిలిచారు. ఇక తెలంగాణ‌కు చెందిన 7 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 5,821 కోట్లు కాగా ఏపీ రాష్ట్రానికి చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. 3,934 కోట్లు.

ఏపీలోని 11 మంది ఎంపీల‌లో 5 మంది, తెలంగాణ‌కు చెందిన 7 మందిలో న‌లుగురు ఎంపీలు రూ. 100 కోట్ల‌కు పైగా ఆస్తులు క‌లిగి ఉన్నారు. ఇక వైసీపీకి చెందిన రాజ్య‌స‌భ ఎంపీల స‌గ‌టు ఆస్తుల విలువ రూ. 357 కోట్లు .

న‌లుగురు బీఆర్ఎస్ రాజ్య‌స‌భ ఎంపీల స‌గటు ఆస్తుల విలువ రూ. 1383 కోట్లు కాగా బీఆర్ఎస్ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.5,534 కోట్లు. తెలంగాణ‌కు చెందిన 71 శాతం రాజ్య‌స‌భ ఎంపీలు క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వైసీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు నేర కేసులు ఎదుర్కొంటున్నారు.