తెలుగు విద్యార్థులలో ట్రంప్ టెన్షన్
వెంటనే వచ్చేయాలని ఆదేశం
హైదరాబాద్ – ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులలో టెన్షన్ మొదలైంది. అమెరికాలో ప్రభుత్వం మారడం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక సీన్ మారింది. ఫస్ట్ అమెరికా నెక్స్ట్ ఇతర దేశాలంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు.
ప్రధానంగా అమెరికాలో ఎక్కువగా తెలుగు వారు నివసిస్తున్నారు. అక్కడ యూనివర్శిటీలలో మన పిల్లలే చదువుకుంటున్నారు. డాలర్ మాయ, మహిమ వీరిని పిచ్చి వాళ్లుగా మార్చేసేలా చేసింది. దీంతో కలల డ్రీమ్స్ సాకారం చేసుకునేందుకు పెద్ద ఎత్తున అమెరికాకు వెళ్లారు.
తాజాగా తెలుగు వారి విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. తాజాగా విదేశీ విద్యార్థులను అలర్ట్ చేస్తున్నాయి యుఎస్ యూనివర్శిటీలు. స్వదేశాలకు వెళ్లిన వారు వెంటనే ఇక్కడికి రావాలంటూ లేక పోతే దారులు మూసేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. వ్యాలిడ్ వీసా ఉన్నప్పటికీ ఉండకుండా జర్నీ చేసేందుకు రెడీ అయ్యారు.
దీంతో ఈ నెలలో పోలోమని స్టూడెంట్స్ పెద్ద ఎత్తున బయలు దేరేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు.